సాక్షి డిజిటల్ న్యూస్ తేదీ 06 నవంబర్ 2025 యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్
మండలంలో ఉన్న రైతులందరు తమ పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోని సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువుల ఆరోగ్యాన్నీ పరిరక్షించుకోవాలని పశువైద్యాధికారి డాక్టర్ యాకుబ్ అన్నారు,గుండాల మండలంలోని తుర్కల షాపురం,వంగాల గ్రామాల్లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాలు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు,కార్యక్రమంలో భాగంగా సుమారు 496 పశువులకు టీకాలు వేయడం జరిగింది అని తెలిపారు కార్యక్రమంలో, వెటర్నరీ అసిస్టెంట్ రాజు గోపాలమిత్రలు గోవిందు, కిష్టయ్య , శ్రీను, నరేష్, శేఖర్ సోమశేఖర్ మరియు రైతులు పాల్గొన్నారు.