సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 6 2025 రిపోర్టర్ రాజు గద్వాల జిల్లా, గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న మీనాక్షి లాడ్జ్ వద్ద డివైడర్ను ఢీకొట్టిన బైక్ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం సేవించి ముగ్గురు ఒకే బైక్పై అతి వేగంగా వస్తున్నారని ప్రాథమిక సమాచారం. మృతులు గద్వాల పట్టణ వాసులుగా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.