గంగారం మండలంలో 4,428 నేల నమూనాల పరిశీలన. రైతులకు నేల ఆరోగ్య కార్డుల పంపిణీ ప్రారంభం.

సాక్షి డిజిటల్ న్యూస్(కొండూరిప్రకాష్)నవంబర్6 గంగారం:-రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా గంగారం మండలంలో రైతుల కోసం నేల ఆరోగ్య కార్డుల పంపిణీ ప్రారంభమైంది. మండలంలో మొత్తం 4,428 నేల నమూనాలను సేకరించి,విశ్లేషించారు.అనంతరం వ్యవసాయ శాఖ అధికారి వేణు యాదవ్ మాట్లాడుతూ ఈ కార్డుల ద్వారా రైతులు తమ భూముల పౌష్టిక స్థితి, ఎరువుల అవసరాలు, మరియు పంటల మార్పిడి సూచనలు తెలుసుకోవచ్చు.మరియు సరైన ఎరువుల వినియోగంతో పంట దిగుబడిని పెంచడం, భూమి సారవంతాన్ని కాపాడటం.రైతులకు సాంకేతిక, శాస్త్రీయ అవగాహనను పెంచుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వేణు, వ్యవసాయ విస్తరణ అధికారులు(AEOలు)మరియు పెద్ద సంఖ్యలో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *