సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 6 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గల సిఈఆర్ క్లబ్ నందు SGF అండర్ 14,17 బాల బాలికల ఉమ్మడి ఖమ్మం జిల్లా రెజ్లింగ్ జట్టు ఎంపికలకు ముఖ్య అతిథిగా స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్ హాజరై,పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ,బాల బాలికలంతా చదువుతో పాటు,క్రీడల పట్ల ఆసక్తి కనబర్చాలని సూచించారు.క్రీడల వల్ల క్రమశిక్షణ,ఆరోగ్యం లభిస్తాయని తెలిపారు.ఈ పోటీలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.