సాక్షి డిజిటల్ న్యూస్ తేదీ 06 నవంబర్ యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్
మండలంలోని వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రంలో శ్రీ కాశి అన్నపూర్ణేశ్వర ఆలయం శిరిడి సాయిబాబా ఆలయంలో భక్తులు వేకుము జాము నుండి పూజా కార్యక్రమం నిర్వహించారు అర్చనలు ప్రత్యేక పూజలు తో పాటు షిరిడి సాయిబాబా ఆలయంలో సామూహిక సత్యసాయి వ్రతాలు వేద పండితులు శ్రీనివాస్ శర్మ వేద మంత్రోత్సవాలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి మధ్యాహ్న హారతుల లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు అనంతరం సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ క్రమంలో సాయంత్రం దీపాలు ప్రమిదలతో వెలిగించారు.కార్యక్రమంలో గంగాపురం నూనెగూడెం మసన్ పల్లి రామారావు నిర్మాల మోత్కూర్ అంబాల వివిధ గ్రామాల నుండి భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అనిల్ శర్మ జువ్వాజి కృష్ణయ్య నాండ్ సిద్ధారెడ్డి నరసింహారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆవుల సురేందర్ బజ్జు నాగరాజు యాదగిరి బొల్లం రాజు తదితరులు పాల్గొన్నారు