కార్తీక పౌర్ణమి భక్తులకు ఎమ్మెల్యే సతీమణి కవితమ్మ అన్నదానం.

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 6 తంబల్లపల్లి మండల రిపోర్టర్ ఇ. రమేష్ బాబు. తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి కవితమ్మ దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మల్లయ్య కొండకు కార్తీక నోము కోవడానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులకు ఉదయం నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మల్లయ్య కొండ చైర్మన్ కె.ఆర్. మల్ రెడ్డి, వైకాపా మండల అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, యువనేత మల్లికార్జున రాయల్, భాస్కర్ రెడ్డి, నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు