కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది….. విజయ్ కుమార్

★కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ SC సెల్ అధ్యక్షులు గా ఆకారం శ్రీను నియామకం. ★కొండపాక లోని తన నివాసంలో శ్రీను కు నియామక పత్రం అందజేసిన జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 06,రిపోర్టర్ తిరుపతి, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది అని, కొద్దిగ ఓపికతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ SC సెల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ అన్నారు. బుధవారం రోజు కొండపాక లోని విజయ్ కుమార్ నివాసంలో మర్పడగ గ్రామానికి చెందిన ఆకారం శ్రీను కి నియామక పత్రం అందజేశారు. నూతనంగా ఎన్నికైన శ్రీను మాట్లాడుతూ నా పై నమ్మకంతో నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సంతోషంగా స్వీకరికరిస్తున్నానని ఇట్టి నియామకానికి సహకరించిన TPCC రాష్ట్ర SC సెల్ అధ్యక్షులు నాగరి ప్రీతం కి, జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు వివేక్ వెంకట స్వామి కి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కి, సీనియర్ నాయకులు మైనం పల్లి హనుమంత్ రావు కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఏర్పల మల్లేశం కి, INTUC జిల్లా అధ్యక్షులు రవీందర్ గౌడ్ కి, ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రవణ్ కి, షోషల్ మీడియా మండల్ కో ఆర్డినేటర్ నాగరాజు కి ఉపసర్పంచ్ నర్సింగారావు కి తిమ్మారెడ్డి పల్లి గ్రామ అధ్యక్షులు బ్రహ్మం కి NSUI జిల్లా కార్యదర్శి భాను చందు కి, కిషన్, సంజీవ్ లు పాల్గొన్నారు.