ఉమ్రా యాత్రికులకు సన్మానం.

సాక్షి డిజిటల్ న్యూస్ 6 నవంబర్ 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా ( షేక్ గౌస్ సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి ) ఉమ్రా యాత్రకు వెళుతున్న మాజీ ఎంపీటీసీ హబీబ్ ఖాన్ ఆయన కుమారుడు పఠాన్ అఫ్రోజ్ ఖాన్ వారి కుటుంబ సభ్యులను ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం అక్బర్ నగర్ లో వారి స్వగృహం నందు శాలువా, పూలమాలలతో సన్మానించారు. గ్రామంలో శాంతి సౌభ్రాతృత్వాలతో సుఖశాంతులతో పాడిపంటలతో మరింత అభివృద్ధి చెందాలని అల్లాతో ప్రార్థించాలని హజ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు సొసైటీ సభ్యులు కోరారు.ఉమ్రా యాత్రికులందరూ ఆరోగ్యంగా, భద్రంగా ప్రయాణించి పవిత్ర మక్కా మదీన ప్రాంతం నందు యాత్ర నియమాలను పాటిస్తూ సంపూర్ణంగా ఉమ్రా నిర్వహించి తిరిగి ఆ అనంత కరుణామయుడు అయిన అల్లాహ్ ఆశీస్సులతో సంతోషంగా తమ స్వస్థలాలకు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు లాల్ మొహమ్మద్, ఉపాధ్యక్షులు సయ్యద్ సికెందర్ ఖాద్రి, మొహమ్మద్ జావీద్ హుస్సేన్,