ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దోర్నాల రామకృష్ణను ఘనంగా సన్మానించిన మధిర ప్రెస్ క్లబ్

సాక్షి డిజిటల్ ప్రతినిధి కొండ అవినాష్ 6-11-2025 మానవతా దృక్పథంతో చేసే వారిసేవలు అనిర్వచనీయం అంటూ పలువురీ ప్రశంసలు ఎన్నో అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి ఎంతోమంది మతిస్థిమితం కోల్పోయిన మానసిక వికలాంగులకు ఆశ్రయము కల్పిస్తు ప్రమాదవశాత్తు రోడ్డు యాక్సిడెంట్లో గాయపడిన క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉన్న ఆర్కే ఫౌండేషన్. ఎన్నో కష్టాలను అపనిందలను అనుభవిస్తూ అందరికీ అందుబాటులో తమ సేవలను విస్తరిస్తున్న ఆర్కే ఫౌండేషన్ మధిర ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించిన ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రామకృష్ణ మానవసేవే మాధవసేవ అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు మధిర పట్టణంలో నిర్వహిస్తూ ఎక్కడ ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఎంతోమంది రైలు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారినీ ముక్కలు ముక్కలు అయిన పురుగులు పట్టిన మృతదేహాలను సైతం తమ బంధువులకు అప్పగించి ఎవరు లేకపోతే స్వయంగా వారే అంచక్రియలు నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా మధిర ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలొ ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ దోర్నాల రామకృష్ణను మధిర ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఎంతోమంది అనాధలకు అభాగ్యులకు మతిస్థిమితం కోల్పోయిన వారికి ఎంతో సహాయం అందిస్తున్న ఆర్కే ఫౌండేషన్ వారి సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా మధిర ప్రెస్ క్లబ్ సభ్యులు అందరికీ ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ .దోర్నాల రామకృష్ణ జ్యోతి అభినందనలు తెలియజేశారు.