అమరవీరుల స్వప్నాల సాఫల్యం కోసం సమరసంకేతాలవుదాం

* దమ్మపేట మండలంలో సిపిఐ, మరియు,వివిధ పార్టీల నుండి సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీలో చేరికలు. * సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్ద భిక్షం

సాక్షి డిజిటల్:నవంబర్ 5, అశ్వరావుపేట ఇంచార్జ్ ,బుల్లా శివ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన అమరవీరుల సంస్మరణ సభ సందర్భంగా సుధాపల్లి, పాత చీపురుగూడెం, లంకాలపల్లి, ఎర్రగుంపు గ్రామాలకు చెందిన కూరం ప్రసాద్, కొరసా వెంకటేశ్వరావు, కొరసా నాగమణి, సోడెం వెంకటేశ్వరరావు, వగ్గేల రాజులు, పొట్టా నాగేశ్వరావు, వగ్గెల ప్రసాద్, సోడెం నాగేశ్వరరావు, వగ్గెల నరేష్ ల నాయకత్వంలో 50 కుటుంబాల వారు సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ లో చేరడం జరిగింది.వీరందరికీ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్ద భిక్షం, డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించటం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకురాలు తోడెం దుర్గమ్మ అధ్యక్షతన జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో వారు మాట్లాడుతూ వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రత్యేకించి 58 ఏళ్ల భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రజల కోసం ఈ దేశంలో ప్రజాతంత్ర సోషలిస్టు విప్లవం కోసం పోరాడి ఎందరో తమ ప్రాణాలర్పించారని అన్నారు భారత దేశంలో వర్గ పీడన దోపిడీ కుల వ్యవస్థ, మతాలు, మూఢనమ్మకాలు, సాంఘిక, రాజకీయ, అసమానతలు, ఆర్థిక అంతరాలు పోవాలని రాయల సుభాష్ చంద్రబోస్, డివి కృష్ణ, ఏనుగు అప్పయ్య,బత్తుల వెంకటేశ్వరరావు,కాచినపల్లి అమరవీరులు కామ్రేడ్ పొట్ల నరసయ్య, పూన్నెం లింగన్న,దొరన్న, బాటన్నలు ప్రజలను ఉద్యమ సిలురుగా తీర్చిదిద్ది ఎందరో కార్యకర్తలను ఉద్యమకారులుగా రాజకీయవేత్తలుగా తీర్చిదిద్ది ముందుకు నడిపించారన్నారు. అలాంటి ఎందరో అమరవీరుల వారసత్వాన్ని కొనసాగించడమే వారికి నిజమైన నివాళులని అన్నారు.1976లో ఎమర్జెన్సీ కాలంలో ఇప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ పేరిట ఎంతోమంది నాయకులను హత్యలు చేసిందని అన్నారు. ఈ ప్రాంతంలో సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ప్రజా పోరాటాలకు ఆకర్షితులై వీరందరూ పార్టీలో చేరడం జరిగిందని వారి సమస్యల కోసం నిరంతరం ప్రజా ఉద్యమాలు ఉదృతం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను,అర్హులైన అందరికీ అమలు చేయాలని ఇందిరమ్మ ఇళ్ళను పేదలందరికీ ఇవ్వాలని ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని అన్నారు. మండలంలోని గ్రామాల నుండి 50కుటుంబాలు పార్టీలో చేరడం అభినందనీయమని అన్నారు. వారందరూ పార్టీ కుటుంబ సభ్యులు అని వారికి ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ ముందుండి వారిని అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు.నియంతృత్వ పాలక పార్టీల విధివిధానాలు నచ్చక వచ్చిన పేద ప్రజలకు విప్లవ పార్టీ అండగా ఉంటుందని నమ్మి వచ్చిన ప్రజలకి విప్లవ అభినందనలు తెలియజేశారు. ఈ ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పడాలని వారిని కోరారు. ప్రాంతంతో పాటు రాష్ట్రంలో పాలక పార్టీలు చేస్తున్న అన్యాయాలపై, అక్రమాలపై మాస్ లైన్ అనేక పోరాటాలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము, తోడం దుర్గమ్మ, కురసం ముత్యాలరావు, పండూరి వీరబాబు, తామ రాముడు, కుంజ కాంతారావు, కేసరి వెంకటేష్, కొండ్రు లక్ష్మి, గంగాధర నాగమణి తదితరులు పాల్గొన్నారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *