సాక్షి డిజిటల్ న్యూస్ కొత్తగూడెం ఇన్చార్జి వనిత మార్కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల మణుగూరులో శనివారం జరిగిన బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడిని ఖండిస్తూ త్వరలోనే స్వార్థ రాజకీయాలతో కూడిన అధికార దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ముక్తకంఠంతో బుద్ధి చెబుతారని వైరా నియోజకవర్గ ఇంచార్జి లాకవతు గిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు ఆయన మాట్లాడుతూ బి ఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే పార్టీ దానిని గమనించిన తెలంగాణ ప్రజలు తమ పార్టీ అధినేత కేసిఆర్ కు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని కట్టి పెట్టారు.సొంత ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ కాదు ,అలాగే కక్ష పూరిత రాజకీయాలకు దూరంగా ఉంటుంది. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే ప్రభుత్వంపై వ్యతిరేకత ను గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం అసహనానికి లోనైనా కాంగ్రెస్ పార్టీ చేసిన మణుగూరు బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయము ను ధ్వంసం చేసిన సంఘటన పట్టి చూస్తే ఇది రాజ్యాంగ విరుద్ధంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తెలుస్తోంది. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.కానీ ప్రభుత్వం దీన్ని సమర్థించుకున్నట్లు తెలుస్తుంది అని గిరిబాబు అన్నారు. అదికార యమోహం తో దాడులకు పాల్పడిన వారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ఇంటికి పంపే ఆలోచనలలో ప్రజలు ఉన్నారు అని లాకావతు గిరి బాబు అన్నారు.