అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు

సాక్షి, డిజిటల్ న్యూస్, నవంబర్ 6, శంకరపట్నం, కరీంనగర్ జిల్లా,(శ్రీరాంపూర్, మంచిర్యాల జిల్లా) శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే ఫైవ్ ఫిట్ సెక్రెటరీ గునీగంటి నర్సింగ రావు దంపతులు, కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా బుధవారం మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమ్మవారిని రకరకాల పూలతో అలంకరించి, వేదమంత్రాలు మధ్య మూడు గంటలపాటు పూజలు నిర్వహించి, నర్సింగరావు , రేణుక, దంపతులు భక్తిని చాటుకున్నారు, తరతరాల నుండి ప్రతి యేటా కార్తీక పౌర్ణమి రోజు ఇంటిలో ప్రత్యేక పూజలు చేయుట ఆలవాయితీగా కోన సాగుతున్నట్లు ఫిట్ సెక్రటరీ నర్సింగరావు , రేణుక దంపతులు, వివరించారు, ఈలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో ఎంతో శుభ పరిణామంగా భావించడం జరుగుతుందని, వారు పేర్కొన్నారు