తుఫాన్ బాధిత రైతులకునష్టపరిహారం అందించాలి

★ఎకరానికి రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం అందించి ఆదుకోవాలి ★రైతు సంఘం జిల్లా నేత,కామేపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్లెంపాటి శ్రీనివాసరావు

సాక్షి డిజిటల్ న్యూస్,కామేపల్లి, (నవంబర్ 4) : తుఫానుతో దెబ్బతిన్న పత్తి,మిర్చి,వరి తదితర పంటల రైతులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే భరోసా కల్పించాలని రైతు సంఘం జిల్లా నేత,కామేపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లెంపాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం కామేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కేంద్ర బిజెపి ప్రభుత్వం,రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరానికి రూ.50 వేలు బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.20 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర,ప్రభుత్వాలు ఆదుకోకపోతే రైతులు దివాలా తీసి ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.వెంటనే జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణమే నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రతి పంటను సందర్శించి,ప్రత్యేక సర్వే నిర్వహించి నష్టపోయిన పంటకు ఎకరానికి రూ.50,000 చొప్పున నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.