30 సంవత్సరాల పైబడిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డా. సిహెచ్. ధనరాజ్

నవంబర్ 4 సాక్షి డిజిటల్ న్యూస్ సిద్దిపేట : మంగళవారం బెజ్జంకి మండలంలోని తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తల సమీక్ష సమావేశానికి హాజరై, వారు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందిస్తున్న ఆర్య కార్యక్రమాల సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు, అనంతరం అక్కడినుండి ల్యాబ్ మరియు ఫార్మసీ గదులను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకుని మందుల నాణ్యత గురించి రక్త పరీక్షల నమూనాల సేకరణ గురించి రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు, గర్భిణీ స్త్రీల నమోదు, వారి యొక్కHB లెవెల్స్ ని పరిశీలించాలని (రక్తహీనత) తీవ్రమైన రక్తహీనతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీల పైన విద్యార్థుల పైన ప్రత్యేక శ్రద్ధ వహించి చికిత్స నించాలని, ఆశ కార్యకర్తలు గృహ సందర్శనకు వెళ్ళినప్పుడు అన్ని రకాల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకునివైద్యాధికారికి తెలుపాలని, ఆరోగ్య కార్యకర్త, సూపర్వైజర్లకు వైద్యాధికారికి తెలుపాలని, గర్భిణీ స్త్రీలకు పిల్లలకు 100% వ్యాధి నిరోక టీకాలు అందేలా చూడాలని, కీటక జనిత వ్యాధుల పైన ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఓ పి/ ఐ పి, ప్రభుత్వ ఆసుపత్రిలో సాధరణ ప్రసవాల సంఖ్య పెంచాలని, తమ పరిధిలో ఉన్న ఆర్ఎంపి పిఎంపీల పైన పర్యవేక్షణ నిర్వహించాలని, సూపర్వైజర్లు ఫీల్డ్ విజిట్ వెళ్ళినప్పుడు ఆరోగ్య కార్యకర్తల పనితీరును పరిశీలించాలని, అన్ని ఆరోగ్య కార్యక్రమాల పనితీరును మెరుగుపరిచేలా వారికి సహాయపడాలని సూచించారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. హాస్టళ్లలో ఆహారం నిల్వ గదులను పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా తెలుసుకోవాలని ఆదేశించారు. కుక్క కాటు, పాముకాటు వంటి అత్యవసర వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సమయపాలన పాటించాలని పాటించని వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట డాక్టర్ కృష్ణ తేజ, డి పీ ఎం ఓ రవీందర్ హెచ్ ఈ ఓ శ్రీనివాస్, హెచ్ ఎస్ విజయ, ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *