స్వదేశీ వస్తువులని వాడాలి

*విదేశీ వస్తువులను బహిష్కరించండి *చిత్తూరు జిల్లా బిజెపి అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు


సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 రామకుప్పం రిపోర్టర్ జయరాం రెడ్డి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ప్రవాసి యోజన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా బిజెపి అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ పాల్గొన్నారు అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువుల్ని వాడి విదేశీ వస్తువులను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతిపక్షాలకు ఏమాత్రం భారతదేశపైనా అవగాహన లేక ఇతర దేశాల వారు తానా అంటే వీరు తందానా అని అంటున్నారని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న ప్రతి పనికి ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేయిస్తున్నాయన్నారు అసలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక వస్తువుని స్వదేశ వస్తూనే కొనాలని ఆయన పిలుపునిచ్చారు భారతదేశ సౌభాగృత్యాన్ని ప్రపంచ దేశాలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనను అభినందిస్తున్నారన్నారు గ్రామీణ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో అన్ని ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందే విధంగా చేస్తున్నానని వివిధ పథకాలను ప్రజల కోసం మంజూరు చేస్తారని దానిలో భాగంగా ప్రధానమంత్రి ఆరోగ్య పథకం ద్వారా ఒక్క వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యం పొందే విధంగా చేశారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యులు ఆంజనేయప్ప, బిజెపి మండల బిజెపి అధ్యక్షురాలు రాణి జనార్దన్ రెడ్డి, నాయకులు బి, నాగరాజు, కమలాత్ రెడ్డి, టైలర్ శ్రీనివాసులు, రవి గురుస్వామి, కార్తీక్, అప్పుస్వామి, ఆదెమ్మ, బి, నాగలక్ష్మి, సిద్దయ్య శెట్టి, శివ కుమార్ ఇంకా పలువురు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *