స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి –భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఉత్తరాంధ్ర అధ్యక్షులు పుట్టా గంగయ్య

అనకాపల్లి , నవంబర్‌ 4 : సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగిరామారావు. కె .కోటపాడు మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం మంగళవారం మండల అధ్యక్షులు పైలా అమ్మాజీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర బీజేపీ అధ్యక్షులు పుట్టా గంగయ్య ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ శక్తిని విస్తరించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రజల్లో స్వదేశీ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించాలని, కార్యకర్తలు కూడా స్వదేశీ వస్తువులనే ఉపయోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సైనికుల పనిచేయాలని సూచించారు. బిజెపి అనుబంధ సంస్థలతో సమన్వయంగా పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్‌చార్జి నియామకాన్ని కూడా ప్రకటించారు. కార్యక్రమంలో చల్లా సత్యనారాయణ, సరగడం సన్యాసినాయుడు, సుందరపు గంగాధర్, కోటాన ఈశ్వరరావు, గజ్జి అప్పలనాయుడు, వర్రీ వెంకటరావు, కూండ్రపు గంగు నాయుడు, సూరిశెట్టి దాసు, బండారు సత్యనారాయణ బీజేపీ నాయకులు, మండల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.