సొంత నిధులతో తండాను అభివృద్ధి దిశలో మార్చేసిన అభిమన్యు రెడ్డి

★పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం - జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ చించోడు అభిమన్యు రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ రామని గణేష్ ఇదిగానిపల్లి, జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని రాజాపూర్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో నర్సంపల్లి తాండాలో తుల్జా భవాని పండుగ వేడుక లో భాగంగా జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ చించోడు అభిమన్యు రెడ్డి తండాకు సొంత ఖర్చులతో ఐమాక్స్ ఫోకస్ లైట్ ఏర్పాటు చేయింంచడం జరిగింది. గతంలో ఆంజనేయ స్వామి దేవాలయం,రెండు ఐమాక్స్ లైట్లు, ప్రస్తుతం తక్షణమే అదనంగా ఇంకో ఐమాక్స్ లైట్లును అమర్చడం జరిగింది.