సాక్షీ డిజిటల్ న్యూస్, కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, అన్నవరం, నవంబర్ 4 రిపోర్టర్ యస్. నాగార్జున. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) సోమవారం సాయంత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆద్వర్యంలో ఈనెల 5వ తేదీన జరగబోయే కార్తీక పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లపై దేవస్థానం ఇఓ వీర్ల సుబ్బారావుతో సమావేశమయ్యారు. గిరిప్దక్షిణ సాగే రహదారులను స్వయంగా పరిశీలించారు.తొలిపావంచాల నుండి ప్రారంభమయ్యే గిరిప్రదక్షిణ స్థానిక సుబ్బరాయపురం, వైజంక్షన్ కూడలి నుండి బెడపూడి పోలవరం కాలవ గట్టుమీద రోడ్డు గూండా సాగి పవర్ హౌస్ వద్ద ముగుస్తుంది. మొత్తం ప్రాంతాలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ దేవస్ధానం అధికారులతో కలసి పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఎస్పీ భక్తుల సంఖ్యకు తగినరీతిలో భద్రతా సిబ్బందిచే ప్రత్యేక పర్యవేక్షణ,వాహనాల పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు మొదలైన అంశాలపై దేవస్థానం ఇఓ వీర్ల సుబ్బారావుతో సమీక్ష నిర్వహించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. సమావేశంలో ముఖ్యాంశాలు భక్తుల భద్రత దృష్ట్యా అన్నవరం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. గిరి ప్రదక్షిణ రోజున భారీ వాహనాలకు ప్రవేశం నిరోధించాలని, భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించాలని ఆదేశించారు.భక్తుల రాకపోకల మార్గాలు స్పష్టంగా గుర్తించబడేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రసార వ్యవస్థ (పబ్లిక్ అడ్రస్ సిస్టమ్) ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు మార్గదర్శక సమాచారం అందించాలన్నారు. సేవా సంస్థలు మరియు వాలంటీర్లు ద్వారా భక్తులకు సహకారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, ప్రసాదాలు, పండ్లు పంపిణీ స్టాల్సు,వైద్య సదుపాయాలు మరియు అత్యవసర సేవలు సమృద్ధిగా ఉండేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేయాలని సూచించారు.
ఫైర్ సర్వీస్, అంబులెన్స్ మరియు రక్షణ బృందాలు తగిన సంఖ్యలో సిద్ధం చెయ్యాలని ఆదేశించారు.
అన్నవరం స్టేషన్ సందర్శణ కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అన్నవరం విచ్చేసిన సందర్బంగా స్థానిక పోలీస్ స్టేషన్ సందర్శించారు. గిరిప్రదక్షిణ రూట్ మ్యాప్ పరిశీలించి, భద్రతా ఏర్పాట్లు ఏవిధంగా ఉండాలన్నది పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.భక్తులు క్రమపద్దతిలో గిరిప్రలక్షిణలో పాల్గొని, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు పోలీస్ సిబ్బంది సహాయం పొందాలని, పోలీసులు సూచనలు పాటిస్తూ ముందుకు సాగి దిగ్విజయంగా గిరిప్రదక్షిణ సంపూర్ణం చెయ్యాలని ఈసందర్బంగా ఎస్పీ భక్తులకు సూచించారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి కె.వి. సత్యనారాయణ, పెద్దాపురం డి.ఎస్.పి డి.శ్రీ హరిరాజు, ప్రత్తిపాడు సి.ఐ బి. సూర్య అప్పారావు, అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు, దేవస్థానం ఏఈఓ దామెర కృష్ణారావు, ఈఈ నూకరత్నం, డిఇ గుర్రాజు తదితరులు పాల్గొన్నారు.