వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు మరియు ప్రశంస పత్రాలను అందచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ”వి.హర్షవర్ధన్ రాజు”

★విద్యార్థులు కృషి, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవండి: జిల్లా ఎస్పీ.

సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 5 ( ప్రకాశం జిల్లా బ్యూరో ఇన్చార్జి: షేక్ మక్బూల్ బాషా). పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో పోలీస్ సిబ్బందికి, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన,డిబేట్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నగదు బహుమతులను మరియు ప్రశంస పత్రాలను అందచేసినారు. పోలీస్ సిబ్బందికి "ప్రస్తుత కాలంలో పోలీసు వ్యవస్థలో సాంకేతికత పాత్ర", విధ్యార్థులకు "లైంగిక నేరాల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర"అనే అంశాలపై వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ప్రథమ బహుమతికి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి రూ.3 వేలు, తృతీయ బహుమతి రూ.2 వేలు ప్రకారం నగదు బహుకరించారు.వ్యాస రచన స్కూల్ మరియు కాలేజీ విద్యార్థులలో విజేతలు: 1వ బహుమతి- వై.జాన్సీ, (10వ తరగతి, డిఆర్ఆర్ ఎమ్ హై స్కూల్, ఒంగోలు). 2వ బహుమతి- వి.అను (9వ తరగతి, వి.బి.వి.స్కూల్ దొనకొండ). 3వ బహుమతి- ఐ.పూజిత (10వ తరగతి, జెడ్పిహెచ్ హై స్కూల్, మర్రిపూడి). వ్యాస రచన పోలీస్ సిబ్బందిలో విజేతలు: 1వ బహుమతి- రామ మూర్తి (హెచ్ సి.1816 ఒంగోలు టు టౌన్ పియస్). 2వ బహుమతి- జి.యోనా (పీసీ - 1186, స్పెషల్ పార్టీ). 3వ బహుమతి- ఆర్కే. కుమార్ (హెచ్ సీ.531 మద్దిపాడు పీఎస్). వ్యాస రచన పోలీస్ పిల్లలు విజేతలు 1వ బహుమతి- కె.మనోగ్న తండ్రి కె.రత్తయ్య, పిసి.1523,డిఏఆర్,ఒంగోలు(10వ తరగతి, అపెక్స్ హై స్కూల్). 2వ బహుమతి- సాయి నిహారిక తండ్రి పవన్ కుమార్, పీసీ.701 యస్.యాన్ పాడు పియస్, (నారాయణ ఈ -టెక్నో,హై స్కూల్, 9వ తరగతి). 3వ బహుమతి- హీనా తండ్రి బాబురావు,పీసీ.3935 డి ఏ ఆర్,ఒంగోలు. (10వ తరగతి, అపెక్స్ హై స్కూల్). డిబేట్ కాంపిటీషన్ లో స్కూల్ మరియు కాలేజీ విద్యార్థులలో విజేతలు 1వ బహుమతి- కె.అర్చన, (9వ తరగతి,గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, ఒంగోలు). 2వ బహుమతి- యన్.చంద్రిక (9వ తరగతి, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, ఒంగోలు). 3 వ బహుమతి- జాయ్ శ్రీ (10వ తరగతి, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, ఒంగోలు). ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరులకు నివాళిగా వారి త్యాగాలను యువతకు పరిచయం చేయడానికి నిర్వహిస్తున్న ప్రేరణాత్మక కార్యక్రమాల్లో వ్యాసరచన పోటీలు ముఖ్యమైన భాగమని అన్నారు. ఈ వ్యాసరచన పోటీలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించామని, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అద్భుతంగా రాసారని విజేతలను అభినందించారు. విద్యార్థులు మంచి అలవాట్లు, క్రమశిక్షణతో చదువుకోవడంతో పాటు క్రీడల్లో పాల్గొని సృజనాత్మక ప్రతిభను వెలికితీయాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, డి.సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.