సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ రిపోర్టర్, విశాఖపట్నం. వైసీపీ యువ విద్యార్థి అధ్యక్షుడు కొండారెడ్డి అరెస్ట్
డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ చేయాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నించిన నేటి యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి.. ముఖ్యంగా చదువుకున్న యువతే ఈ యొక్క డ్రగ్స్ వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. నిన్న విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో విశాఖ జిల్లా వైసీపీ యువ విద్యార్థి అధ్యక్షుడు కొండారెడ్డిని మరో ఇద్దరు నిందితులను విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈగల్ టీమ్-టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని. సోమవారం ఉదయం పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన మీడియా సమావేశంలో డీసీపీ డి. మేరీ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎల్ ఎస్ డి బ్లాట్స్ (మత్తు మందులు) చట్ట విరుద్ద రవాణా జరుగుతోందని వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ / ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు సిటీఎఫ్ బృందం యొక్క జాయింట్ ఆపరేషన్ ద్వారా పక్క వ్యూహంతో దాడిచేసి 48 ఎల్ఎస్ఈ బ్లాట్స్ మరియు నేరానికి సంబంధించిన ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నామని.విచారణలో భాగంగా ఈ ముగ్గురు నిందితులు పరస్పర మిత్రులు, మద్యం, గంజాయి మరియు మత్తు పదార్ధాలు (డ్రగ్స్) వంటి చెడు అలవాట్లకు అలవాటు పడ్డవారని, వీరు తరచుగా మత్తు పదార్థాల వినియోగం కోసం కలుసుకునేవారని మరిన్ని డ్రగ్స్ అవసరమైన కారణంగా, కొండా రెడ్డి, మురాడ గీత్ చరణ్‌ను సంప్రదించి, బెంగళూరులో ఉన్న సంథన్ అనే వ్యక్తి వద్ద నుండి ఎల్ ఎన్ డి బ్లాట్స్ తెప్పించాలని చెప్పాడు. ఇంకేముంది అనుకున్నదే తడువుగా సంథన్, హర్షవర్ధన్ నాయుడు యొక్క స్నేహితుడు. దీనికనుగుణంగా, కొండా రెడ్డి రూ. 25,000/- మరియు విమాన, ట్రైన్ టిక్కెట్లు ఏర్పాటు చేయగా, తద్వారా గీత్ చరణ్ బెంగళూరుకు వెళ్లి సంథన్ నుండి ఎల్ ఎస్ డి బ్లాట్స్ తేవడానికి కోసం 31-10-2025 న, గీత్ చరణ్ విశాఖపట్నం నుండి బెంగళూరుకు విమానంలో ప్రయాణించాడు. తరువాత రోజు 01-11-2025, టెలిఫోన్ ద్వారా కొండా రెడ్డి మరియు సంథన్ మధ్య సంభాషణ జరిగిందని అదే రోజు, కొండా రెడ్డి స్నేహితుడు డొంక గణేష్ యొక్క ఫోన్‌పే ఖాతా ద్వారా రూ. 25,000/- సంథన్ కు పంపించాడు దీనితో, సంథన్ మొత్తం 50 ఎల్ ఎస్ డి బ్లాట్స్ కొనుగోలు చేసి, వాటిలో 48 ఎల్ ఎస్ డి బ్లాట్స్ ను గీత్ చరణ్ కు ఇచ్చి, 2 బ్లాట్స్ ను తన కొరకు ఉంచుకున్నాడు. తరువాత, 01-11-2025న గీత్ చరణ్ బెంగళూరు నుండి దూరంతో ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి విశాఖపట్నానికి బయలుదేరి, 02-11-2025 న విశాఖపట్నం నగరానికి చేరుకున్నాడు. అక్కడికి రాగానే, కొండా రెడ్డి అతనికి ఫోన్ చేసి, రైల్వే స్టేషన్ బయట వేచి ఉండమని చెప్పాడని కొద్ది సేపట్లోనే కొండా రెడ్డి మరియు హర్షవర్ధన్ నాయుడు అక్కడికి వచ్చారు. గీత్ చరణ్ వద్ద నుండి ఎల్ ఎస్ డి బ్లాట్స్ తీసుకునే సమయంలో, పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని మరో నిందితుడు పరారీ లో ఉన్నాడని.
వారి నుండి 48 ఎల్ఎస్ఏ బ్లాట్స్ ( లిసర్జీక్ యాసిడ్ డైతిల్ అమైడ్, బ్లూ కలర్ ఐక్యూ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, గ్రే కలర్ ఐఫోన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఓలా ఎలక్ట్రిక్ స్కూటీ (ఏపీ40-సి ఎన్-9228) ను, ఇంకా వైట్ కలర్ ఐఫోన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించామని.ఈ బ్లాట్స్ ను వైసీపీ యువ విద్యార్ధి అధ్యక్షుడైన కొండారెడ్డి కోసం తీసుకు వస్తున్నట్టు వెల్లడైందని, ఈ కేసులోని మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, ఇంకా పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని డీసీపీ వివరించారు.