రోడ్డెక్కి నిరసన తెలిపిన రైతులు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 04, మల్లాపూర్ మండల రిపోర్టర్, ఆకుతోట నర్సయ్య :జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గత వారం రోజుల నుండి మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో తేమశాతం చూడకుండా రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వారం గడిచిన కొనుగోలు ప్రారంభించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. హమాలీల కొరత ఉందని, సరైన వసతులు కల్పించకుండా, మక్కలను తూకం వేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు.