సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం రిపోర్టర్ ఎన్ కృష్ణయ్య.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మల్దకల్ మండల కార్యదర్శి కామ్రేడ్ రంగన్న & ప్రయాణికుల విన్నపము. మల్దకల్ మండలంలో మల్దకల్ గ్రామం నుండి ఎలుకూరు గ్రామం వరకు, పెద్దపల్లి నుండి ఎలుకూరు గ్రామం వరకు అడివి రావుల్ చెరువు నుండి మల్దకల్ మండలం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు పెరిగి ప్రయాణికులకు (వాహనదారులకు) అలాగే ఎదురెదురుగా వచ్చే పెద్ద పెద్ద వాహనాలకు బస్సులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అలాగే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతూ ప్రమాదాలకు తావునిస్తు అలాగే చెట్ల కొమ్మలు రోడ్డు మీదకు పెరగడం వల్ల కూడా ఎదురుగా వచ్చే వాహనాలు కనపడడం లేదు కావున దీనిని దృష్టిలో ఉంచుకొని మల్దకల్ మండల రెవెన్యూ & (Mpdo బృందం)ప్రజా పరిషత్ అధికారులు ఎల్కూరు. మల్దకల్. నీలిపల్లి. గార్లపాడు. పెద్దపల్లి పాల్వాయి. పంచాయతీ కార్యదర్శులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ CPI తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ మల్దకల్ మండల కార్యదర్శి కామ్రేడ్ G.రంగన్న ఎల్కూర్. ఎలుకూరు cpi గ్రామ సహాయ కార్యదర్శి జి వెంకటేష్. ఎల్కూరు గ్రామస్తులు పకీరన్న. అడివన్న. సంజన్న. ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.