రైతు సేవ కేంద్రం పక్కన ఉన్న ఇంటి పట్టాను రద్దు చేయండి

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద నవంబర్ 4, మండల పరిధిలోని నెర నికి గ్రామంలో నిర్మాణం ఉన్న రైతు సేవ కేంద్రం ,విలేజ్ క్లినిక్ పక్కన ఉన్న ఇంటి పట్టాను రద్దు చేయాలని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామ సర్వే నెంబర్ : 495 లో ఇచ్చిన ఇంటిపట్టాను రద్దుచేసి భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ భవనాలకు ఉపయోగపడే పరంగా అందుబాటులో ఉండేందుకు ఇచ్చిన ఇంటి పట్టాను రద్దుచేసి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు ఈ విషయం ఆలూరు ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి వారికి తెలిపినామని గ్రామంలో ప్రభుత్వ భూమిని ఎవరు కూడా అక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటారని వారు కూడా తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు గ్రామంలోని ప్రభుత్వ స్థలాల్లో ఇచ్చిన పట్టాలను అన్ని కూడా రద్దు చేయాలని గ్రామస్తులు తాసిల్దార్ నిజాముద్దీన్ కు సూచించారు గ్రామంలో పారిశుద్ద పనులపై పంచాయతీ కార్యదర్శి నెలకు ఒకసారి గ్రామానికి సందర్శిస్తారని గ్రామస్తులు ఆరోపించారు గ్రామంలోని దుర్వాసన వెదజల్లుతుందని గ్రామ ప్రజల ఆరోపిస్తున్నారు గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించుకున్న కాలయాపన చేసి తమ గ్రామానికి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పంచాయతీ కార్యదర్శులు మార్చి వేరే పంచాయతీ కార్యదర్శి ని తమ గ్రామంలో అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు గ్రామంలోని త్రాగునీరు డ్రైనేజీ సమస్య తమ పారిశుద్ధ పనులు బ్లీచింగ్ పౌడర్ చల్లించడం వంటి పనులు చేపట్టడం లేదని గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై తాసిల్దార్ నిజాముద్దీన్ వివారణ కోరగా గ్రామాన్ని సందర్శించి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో
బోయ మల్లికార్జున, మఠం తిమ్మప్ప,ఉప సర్పంచ్ కురవ మల్లికార్జున,జొన్నగిరి మల్లన్న గౌడ్, రాంపురం వీరేష్,హరిజన గిరి, హరిజన గాదిలింగ, బోయ మల్లయ్య, మూలింటి రాజా, చాకలి సదాశివ, చాకలి గిరప్ప, మాల శీను, కురువ లింగప్ప, హరిజన నాగరాజు, కోటేహాల్ కాశీమ్, మఠం మహేష్, బోయ వెంకటేష్ పాల్గొన్నారు