తల్లాడ/నవంబర్ 04(సాక్షి డిజిటల్ న్యూస్ ) తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామం లో రైతువేదిక లో మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు భూసార పరీక్షలను బట్టి వాటి ఆధారంగా వివిధ పంటలలో పోషకాల సమతుల్యత ప్రాముఖ్యతను మరియు పామ్ ఆయిల్ సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమం లో అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య రైతులతో మాట్లాడుతూ భూసార పరీక్షల ఫలితాలను వివరిస్తూ ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారులు డి. పుల్లయ్య, వి. శ్రీనివాస్ రెడ్డి,కె. స్వరూప రాణి, బాల ప్రకాష్, జి. వి. రామారావు, తల్లాడ మండల వ్యవసాయ అధికారి ఎండీ తాజుద్ధిన్, కుర్నవల్లి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.