సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 4, పిట్లం మండలం, భూమయ్య పిట్లం గద్దగుండు తండా చిన్న కొడంగల్ ధర్మారం గ్రామాలలోని NH 161 రోడ్డుపైన మరియు ఇతర రోడ్ల పైన రైతులు వడ్లు కానీ మక్కలు గాని జొన్నలు గాని వివిధ రకాల ధాన్యాలు రోడ్లపై ఆరబెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని పిట్లం ఎస్ ఐ వెంకట్రావు తెలిపారు.కావున రైతులు అందరూ పంటలను రోడ్లపై ఆరబెట్టకుండా ఉండాలని రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అనే ఉద్దేశంతో పిట్లం ఎస్సై వెంకట్రావు, నేషనల్ హైవే వారు కలిసి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినది.