సాక్షి డిజిటల్ న్యూస్ 4 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు కార్తీక శుద్ధద్వాదశి పర్వదినం సందర్బంగా మండలంలోని ఏ. కొత్తపల్లి గ్రామంలో శ్రీ కోదండ రామాలయం వద్ద ఆలయ అర్చకులు ఆదిత్య శర్మ మంత్రోచ్ఛరణ లో కోదండరామ మహిళ భక్తులు లక్ష ఒత్తులు దీపాలంకరణ సేవ కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, సర్పంచ్ వెంకట రమణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు యువకులు స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.