సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లారామకుప్పం మండలం బిజెపి కార్యకర్తలు సమావేశం శ్రీ వల్లి దేవసేన శ్రీసుబ్రహ్మణ్యస్వామి దేవాలయం వద్ద మండల పార్టీ nకన్వీనర్ ఆంజనేయప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు బిజెపి కార్యకర్తలు అభిప్రాయం మేరకు మండల పార్టీ అధ్యక్షురాలుగా రాణి జనార్దన్ రెడ్డిని చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ప్రకటించారు అనంతరం వారు మాట్లాడుతూ మండల బిజెపి కార్యకర్తలు కలుపుకొని అన్ని కార్యక్రమాలు విస్తృతం చేయాల్సిన అవసరం ఉన్నదని వారు పేర్కొన్నారు కూటమి పార్టీల ప్రభుత్వం అధికారంలో ఉన్నదన్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరమావదిగ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా సమయం నుంచి నేటి వరకు పేద ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారని అది కూడా ప్రజలకు తెలపాలన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని తెలిపారు అనంతరం నూతన మండల అధ్యక్షురాలు రాణి జనార్దన్ రెడ్డిని అందరూ సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యులు ఆంజనేయ, బిజెపి నాయకులు బి నాగరాజు జనార్దన్ రెడ్డి లోకేశ్వర్ రెడ్డి కమలాత్ రెడ్డి సుకుమార్ రెడ్డి రవి గురుస్వామి శ్రీనివాసులు సిద్దయ్య, నాగలక్ష్మి , ఆదెమ్మఇంకా పలువురు పాల్గొన్నారు