పార్వతీపురం మన్యం, నవంబర్ 4 సాక్షి డిజిటల్ న్యూస్ (జి గోపాలరావు).. దేశ రాజధాని ఢిల్లీలో మన జిల్లా పార్వతీపురం ప్రతిభ చాటేలా యువత సంబంధిత రంగాలలో నైపుణ్యాలను, మెలుకువలను, ప్రతిభ కనబరిచి ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని ఆ దిశగా అడుగులు వేసే యువతకు అన్ని విధాల ఆర్థికంగా ఇతరత్రా తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని పార్వతిపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హామీ ఇచ్చారు. ప్రయాణ ఖర్చులు వసతి ఖర్చులు తన సొంత నిధులతో సమకూరుస్తానని యువతకు భరోసా ఇవ్వడం కనిపించింది. మంగళవారం ఉదయం యువజన సర్వీసుల శాఖ సబ్విచ్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లాస్థాయి యువజన ఉత్సవ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముందుగా వివేకానందుని విగ్రహానికి పూలమాలలు అలంకరించి నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన యువత నృత్యాలు వినోద కార్యక్రమాలు సందేశాత్మక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత పక్కదారి పట్టకుండా వివిధ రంగాలలో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచే విధంగా అవకాశాలను పెంపొందిస్తుందని గుర్తు చేశారు. వికసిద్భారత్ 2047 విజయవంతం కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు నిరంతరం కృషి చేస్తున్నారని డబల్ ఇంజన్ సర్కార్ మూలంగా రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు తోపాటు స్వయం ప్రతిపత్తి సాధించే అవకాశాలు మెరుగుపడుతున్నాయని అందరూ వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి సహాయ సహకారాలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో సమిష్టి చర్యలు ఫలితంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు లభించే పరిశ్రమలు ఐటీ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని మరింత ముఖ్యంగా విశాఖ కేంద్రంగా ఐటి హబ్ ఏర్పడిన ఉండడంతో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి యువత కీలకమని వారు అభివృద్ధి చెందితే పల్లెల నుండి పట్టణాల వరకు అభివృద్ధి చెందుతాయని ఆఫీసుగా ఆలోచించి వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకునే విధంగా అభివృద్ధి చేసుకునే పరంగా యువత ముందుండాలని ి. కార్యక్రమంలో సర్పంచ్ సీఈవో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లు నాగేశ్వరరావు ఇతర అధికారులు అధిక సంఖ్యలో యువత తదితరులు పాల్గొన్నారు.
