మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు.

★మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారి లైసెన్సుల రద్దు. ★జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ హెచ్చరిక!

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబరు.4, బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి అన్నమయ్య జిల్లాలో మైనర్ల వాహన చోదకంపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ప్రజల భద్రతను పెంచడానికి జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు:18 సంవత్సరాల లోపు పిల్లలకు ద్విచక్ర వాహనాలు లేదా ఇతర మోటారు వాహనాలను నడపడానికి ఇవ్వరాదు. వారి భద్రతకు, పౌరుల రక్షణకు ఇది చాలా ముఖ్యం. కఠిన చర్యలు తప్పవు మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు, సంరక్షకులు, మరియు వాహన యజమానులపై (ఓనర్లపై) చట్టపరమైన కేసులు నమోదు చేయబడతాయి. లైసెన్సు రద్దు అంతేకాకుండా, ఈ నిబంధనను ఉల్లంఘించిన వారి యొక్క డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసేలా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తల్లిదండ్రులు, సంరక్షకులు బాధ్యతగా వ్యవహరించి, తమ పిల్లలు రోడ్డుపైకి వచ్చి ప్రమాదాల బారిన పడకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గారు సూచించారు.
సహకరించాలిజిల్లాలో రోడ్డు భద్రతను కాపాడటానికి జిల్లా పోలీస్ శాఖకు ప్రజలంతా సహకరించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.