మెదక్ జిల్లాలో విద్యుత్తు సమస్యలన్ని పరిష్కరించేలాచర్యలు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 5మెదక్ ఇంచార్జ్ బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్, జిల్లా వ్యాప్తంగా 102 వినతులు స్వీకరించిన విద్యుత్తు అధికారులు మెదక్​లో వినతులు స్వీకరించిన విద్యుత్తు శాఖ ఎస్​ఈ నారాయణ నాయక్, అధికారులు మెదక్​ జిల్లాలో విద్యుత్తు వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం నిర్వహించిన విద్యుత్తు వినియోగదారుల సదస్సుకు మంచి స్పందన లభించిందని ఈ విషయంలో వినియోగదారుల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్​ ఎస్​ఈనారాయణ నాయక్​ అన్నారు. విద్యుత్తు వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాలోని ఎస్​ఈ కార్యాలయంతో పాటు డివిజనల్ ఇంజనీర్​, సబ్ డివిజనల్ కార్యాలయాల్లో నిర్వహించిన సదస్సులో జిల్లా వ్యాప్తంగా 102 ఫిర్యాదులు, ఆర్జీలను స్వీకరించినట్లు ఎస్​ఈ నారాయణ నాయక్​ తెలిపారు. ఈ సందర్భంగా మెదక్​ డివిజన్​ పరిధిలో 16, సబ్​ డివిజన్​ పరిధిలో 28, పాపన్నపేటలో 20, తూప్రాన్​లో 23, రామాయంపేటలో 15 సంబంధిత అధికారులు తీసుకొని అందుకు తగిన పరిష్కారాన్ని వినియోగదారులకు సూచించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా ఇళ్ళపై విద్యుత్తు తీగలు ఉండటం, కేటగిరీల్లో మార్పులు, విద్యుత్తు స్తంభాలు ప్రమాదకరంగా ఉండటంతో పాటు విద్యుత్తు తీగలను మార్చాలని, మీటర్​ రీడింగ్​ తప్పుగా బిల్లులు వస్తున్నాయని, మీటర్లు కాలిపోయాయని ఫిర్యాదులు వచ్చాయని ఎస్​ఈ నారాయణ నాయక్ తెలిపారు. అలాగే ప్రభుత్వం నాయిబ్రాహ్మణులు, రజకులకు ఉచితంగా అందచేస్తున్న విద్యుత్తు విషయంలో సైతం ఫిర్యాదులు తీసుకున్నామని వివరించారు. విద్యుత్తు వినియోగదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులలో 15 ఫిర్యాదులను వెంటనే తమ సిబ్బంది పరిష్కరించారని తెలిపారు. అలాగే మిగిలిన ఆర్జీలు, ఫిర్యాదులు, సమస్యలను సైతం త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో విద్యుత్తు వినియోగదారులు సదస్సును వినియోగించుకోవడం జరిగిందని… మున్ముందు రోజుల్లో సైతం వినియోగదారుల సౌకర్యం కోసం వారి సమస్యలను పరిష్కరించేందుకు సదస్సులను నిర్వహించడం జరుగుతుందని ఎస్​ఈ నారాయణ నాయక్​ తెలిపారు. అలాగే జిల్లాలో గృహావసర విద్యుత్తుతో పాటు రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్తును అందించేందుకు తమ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్​ ఇంఛార్జి డీఈ శ్రీనివాస్​ విజయ్​, ఏడీఈ మోహన్​ బాబు, ఎమ్​ఆర్​టీ డీఈ సోమేశ్వరరావు, విజిలెన్స్​ డీఈ శ్రీనివాస్​ రెడ్డి, మెదక్​ టౌన్​ ఏఈ నవీన్​, మెదక్ రూరల్​ ఏఈ రాజ్​కుమార్​, చిన్నశంకరంపేట ఏఈ సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *