ముమ్మిడివరం సి ఐ మోహన్, కాట్రేనికోన ఎస్ ఐ అవినాష్

★జిల్లా కలెక్టర్ చేతులు మీదగా అవార్డు పొందారు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 5, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు
ముమ్మిడివరం నియోజకవర్గం .. ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ మరియు కాట్రేనికోన ఎస్సై అవినాష్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రవిరాల మహేష్ కుమార్ మొంధా తుఫాన్ ఫైటర్ అవార్డు అందచేశారు.ఇటీవల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ను మొంధా తుఫాన్ అతలా కుతలం చేయడంతో, విపత్కరపరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు, సమయ స్ఫూర్తితో కూడిన ఆలోచనలు చేయడంతో ముమ్మిడివరం సిఐ మోహన్,కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ ప్రజల మన్ననలు, అధికారుల ప్రశంసాలు పొందగాలిగారు.కాట్రేనికోన మండలంలో మగసానితిప్ప, బలుసుతిప్ప, చిర్రయానం, గచ్చకాయలపోర లాంటి తీరప్రాంత గ్రామ ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించినందుకు,మెరుగైన సేవలు అందించినందుకు జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్, ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్,కాట్రేనికోన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఐ అవినాష్ కు,ఉత్తమ సేవా అవార్డు అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా చేతుల మీదగా అందచేశారు.ఈ సందర్భంగా ఎస్పి రాహుల్ మీనా మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల్లో రెవెన్యూ యంత్రాంగం, పోలీసు శాఖ, విద్యుత్ శాఖ మరియు అన్ని శాఖల సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేశారని జిల్లా కలెక్టర్ అన్నారు.