మీసాల లచ్చయ్య కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివి

★అమీనాబాద్ మాజీ సర్పంచ్ డా.ముత్తినేని కోటేశ్వరావు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 2025 అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్, మీసాల లచ్చయ్య కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివనీ అమీనాబాద్ మాజీ సర్పంచ్ డా.ముత్తినేని కోటేశ్వరావు అన్నారు.మంగళవారం మండలంలోని అమీనాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీసాల లచ్చయ్య అనారోగ్యంతో మృతి చెందారు.ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ సర్పంచ్ డాక్టర్ ముత్తినేని కోటేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి మీసాల లచ్చయ్య పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీసాల లచ్చయ్య చివరి క్షణం వరకు పార్టీ జెండాను తన భుజాలపై వేసుకుని కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ కోసం కృషి చేశారాన్నారు.పేదరికంలో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ మృతి చెందిన లచ్చయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.గ్రామంలో ప్రతి పార్టీ కార్యకర్త మీసాల లచ్చయ్య ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.