సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 5 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్ మోత్కూర్ లో పత్రికా ప్రతినిధులతో గుండు వెంకటనర్సు మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వానికి బీసీల పై చిత్తశుద్ధి ఉంటే 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తుచేశారు. అసెంబ్లీలో మద్దతు తెలపిన బీజేపీ కేంద్రంలో అడ్డుకోవడంతో రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినేన్స్ గవర్నర్ ఆమోదనికి పంపిందని దాన్ని గవర్నర్ ఆమోదించక పోవడంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ ను కూడ విడుదల చేసిందని, అన్నారు.జీఓ పై హైకోర్టు స్టే విధించిందని,సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఆఫీలును కొట్టివేసిందని తెలిపారు. దానికి నిరసనగా జరిగిన బంద్ లో అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు తెలిపాయని, కేంద్రంలో బీసీ బిల్లును అడ్డుకుంటున్న బీజేపీ కూడ బంద్ లో పాల్గొనడం మోసపూరిత వైఖరికి నిదర్శనమని అన్నారు. ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో చట్టసవరణ చేసి బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.బీసీ బిల్లుకు కేంద్రం అడ్డుపడుతునందున అన్ని రాజకీయ పక్షాలు స్వచ్ఛంద సంస్థలు కేంద్రంపై వత్తిడి తేవాలని కోరారు. రాష్ట్రంలో ఓట్లు, ఇతర ప్రయోజనాల కోసమే మోసపూరిత విధానాలకు పాల్పడుతూ బీజేపీ ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, కురిమేటి యాదయ్య, పానుగుల రమేష్, పిట్టల చంద్రయ్య, దడిపల్లి సైదులు ఉన్నారు.