బిసి రిజర్వేషన్ అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చాటుకోవాలి :

★కొత్తగట్టు మల్లన్న

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 5 తిరుమలగిరి మండల రిపోర్టర్ బాకీ శ్రీనివాస్, తిరుమలగిరి మండల కేంద్రంలోని పూలే-అంబేద్కర్ చౌరస్తాలో సామాజిక తెలంగాణ మహాసభ మరియు బహుజన కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమ నాయకులు కందుకూరి ప్రవీణ్ సభా అధ్యక్షతలో ఏర్పాటుచేసిన బిసి రిజర్వేషన్ సాధన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ , ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమాల ఉపాధ్యాయులు కొత్తగట్టు మల్లన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సబండ కులాలు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలంతా ఏకమై బహుజన సమాజమంతా మేల్కొని ముక్తకంఠంతో విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా ప్రత్యేక తెలంగాణ పోరాట స్ఫూర్తితో మరొక ఉద్యమం చేస్తామని ఆయన తెలియజేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల , వారికి మాట ఇచ్చిన రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి వహించాలని వెంటనే పార్లమెంటు లో బీసీల రిజర్వేషన్ చట్టబద్ధతపై రాజ్యాంగ సవరణ చేయాలని , 9 వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకొస్తే బీసీలకు విద్యా ఉపాధి ఉద్యోగ రాజకీయ రంగాల్లో తో పాటు కాంట్రాక్టులు మరియు అనేక రకాల ప్రైవేట్ రంగాలలో ప్రభుత్వ నామినేషన్ పదవులలో 42 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా బీసీల పట్ల చిత్తశుద్ధి చాటుకోవాలంటే ఇచ్చిన మాటను కట్టుబడి ఉండాలని ఏదో మొక్కుబడిగా బీసీ రిజర్వేషన్ పట్ల బిల్లును ప్రవేశపెట్టడం, ఆర్డినెన్స్ తీసుకురావడం ,చట్టం తేవడం ఇదంతా సబ్బండ బీసీ సమాజాన్ని మార్చడమేనని రాజ్యాంగ రక్షణ లేని ఏ చట్టాలైన కోర్టులలో నిలువదనీ సమాజానికి అంత తెలుసని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే పార్లమెంట్లో చట్టం తేవచ్చని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే బీసీల రిజర్వేషన్ సాధనకై తిరుమలగిరి కేంద్రం నుండి మరో ఉద్యమాన్ని మొదలు పెడతామని ఉద్యమ కార్యచరణ ఇస్తామని బీసీలంతా ఏకమై మొత్తం బహుజన సమాజాన్ని కలుపుకొని తిరుమలగిరి కేంద్రంగా చేసే ఉద్యమం తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి లాగా ఏర్పాట అయ్యేలా ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పులిమామిడి సోమన్న పులిమామిడి బిక్షం, పద్మశాలి సంఘం నాయకులు చింత కింది సోమనారాయణ , చింతకింది మురళి, గౌడ సంఘం నాయకులు మరియు మన ఆలోచన సాధన సమితి తిరుమలగిరి మండల కన్వీనర్ గిలకత్తుల రాము గౌడ్, పూసల సంఘం నాయకులు చేను శ్రీనివాస్, యాదవ సంఘం నాయకులు పయ్యాముల వెంకన్న యాదవ్, మైనార్టీ నాయకులు ఎండి రెహమాన్ అలీ, ఎండి ఖాసిం , ముదిరాజు సంఘం నాయకులు భైరబోయిన వెంకటేశ్వర్లు, మున్నూరు కాపు సంఘం నాయకులు పసునూరి శ్రీనివాస్, ఆలేటి శంకర్, గట్టు నర్సింగరావు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు కొత్తగట్టు రాజు, కొత్తగట్టు యాదగిరి, ఉపేందర్, బలిజ సంఘం నాయకులు ఆరాని సోమరాజు, శాలివాహన సంఘం నాయకులు పాలబిందెల మహేష్, బైండ్ల సంఘం నా యకులు కడియం సంజీవ, సైకిల్ షాప్ బైరబోయిన వెంకటేశ్వర్లు, పుల్లయ్య, అశోక్, వనగండ్ల నరేష్, సొల్లేటి రాములు తదితరులు పాల్గొన్నారు.