సాక్షి డిజిటల్ న్యూస్నవంబర్ 4బలిజిపేట మండలం రిపోర్టర్ మురళి బలిజిపేట మండలంలోని అరసాడ గ్రామంలో మండల పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులుగా పనిచేస్తున్న ఐదు కుటుంబాలను అకారణంగా ఎటువంటి నోటీసు లేకుండా తొలగించి, నాయకులకు సంబంధించి నా అగర కులాలను నియమించడము సరైన పద్ధతి కాదని జనసేన పార్టీ పార్వతిపురం పిఓసి ఆదాడ మోహనరావు అన్నారు ఆయన వారి కుటుంబాలను పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనులు రజకలు అని కుల వివక్షత చూపి వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించడం సరైన పద్ధతి కాదని వెంటనే వారిని అదే స్థానాల్లో నియమించాలని ఆయన కోరారు. గత 22 సంవత్సరాలుగా వారు ఆయా పాఠశాలలో పిల్లలకు సేవలు అందించారని ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా 22 సంవత్సరాలు విధి నిర్వహణలో ఉంటే కేవలం దళితులని వారిని తొలగించి అగ్రకులాలకు ఆ స్థానాల్లో నియమించడం సరికాదని వెంటనే వారి స్థానాల వారికి పెంచాలని లేనిపక్షంలో సంబంధిత చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు