ప్రధాన రహదారిపై లారీ పట్టించుకోని సంబంధిత అధికారులు

★24 గంటలు గడిచిన మరమ్మతులకు గురైన లారీని పక్కకు తొలగించలేదు

సాక్షి డిజిటల్ న్యూస్ : 4 నవంబర్ 2025 తంబాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం కురుబలకోట మండలంలోని అంగళ్లు విశ్వం కాలేజ్ కూడలి వద్ద లారీ మరమ్మత్తులకు గురై ఆగి ఇప్పటికీ 24 గంటలు గడిచిన రోడ్డుపై నుండి పక్కకు తొలగించక పోవడంతో ఏ సమయంలో అయినా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు చర్చించు కుంటున్నారు. నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉంటుందని సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులకు గురైన లారీని పక్కకు తొలగించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.