పోలీసుల చర్యలకు స్పందన

★రోడ్ల మీద తిరుగుతున్న ఆవులను భద్రపరుచుకుంటున్న యజమానులు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 పెనగలూరు రిపోర్టర్ మధు పెనగలూరు మండలం మండల కేంద్రంలో గత నాలుగు రోజుల క్రిందట పెనగలూరుపోలీసులు రోడ్లపై తిరుగుతూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న ఆవులను యజమానులు ఇళ్ల వద్దనే ఉంచుకోవాలని లేనియెడల స్వచ్ఛందంగా గోశాలకు తరలించే కార్యక్రమం జరుగుతుందని పంచాయతీ వ్యాప్తంగా టామ్ టామ్ వేయించడంతో మూడు రోజుల నుంచి ఆవుల యజమానులు ఆవులను రోడ్లపైకి రానీయకుండా జాగ్రత్త పరుచుకునే చర్యలలో నిమగ్నమయ్యారు చాలామంది ఆవుల యజమానులు వాటిని ఇంటి వద్దనే కట్టడి చేసుకొని పొలాలకు తోలుకెళ్ళి మేపుకుంటుండగా వాటిని పోషించే స్తోమత తగ్గిన మరి కొంతమంది వాటిని అమ్ముకునే పనిలో నిమగ్నమయ్యారు. మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. పెనగలూరు పోలీసులు సోమవారం నాటికి చివరి హెచ్చరిక గడువు కావడంతో గోవుల యజమానులు కూలీ డబ్బులు ఇచ్చి మనుషులను పెట్టుకొని ఆవులను బంధించి కట్టడం చేసుకునే పనిలో ఉన్నారు. ఏదిఏమైనాప్పటికీ హైస్కూలు సమీపము నుండి పోలీస్ స్టేషన్ వరకు మూడు రోడ్ల కోడలి నుండి కొత్తపల్లి వినాయక స్వామి దేవాలయం వరకు ఆవుల తాకిడి తగ్గనుంద నీ ప్రజలు అనుకుంటున్నారు