పెద్దమ్మ తల్లి ఆలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు.

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 04 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్ మోత్కూర్. మున్సిపల్ కేంద్రంలో ని పెద్డమ్మ తల్లి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని మంగళవారం పురోహితుడు పారునంది లక్ష్మణమూర్తి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆవు పేడ,మారేడు ప్రతులతో చేసిన శివలింగానికి భక్తులు పెద్దఎత్తున పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ కి చెందిన బట్టు సత్యనారాయణ రజిత దంపతులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బైరు యాకస్వామి, తవిటి హరినాధ్,ధబ్బేటి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.