పాల్వంచ గట్టాయిగూడెంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత పర్యటన.

★త్వరలో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం అని హామీ.

సాక్షి డిజిటల్ న్యూస్:4 నవంబర్,పాల్వంచ.రిపోర్టర్:కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలో గల గట్టాయిగూడెంలో మంగళవారం కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత విస్తృత పర్యటన చేశారు.ఈ పర్యటనలో భాగంగా రోడ్లు,డ్రైనేజ్ లు, మిషన్ భగీరథ నీళ్లను పరిశీలించారు.గట్టాయిగూడెం ప్రజలను అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం కేటాయించిన నిధులు పరిమితంగా ఉన్నాయని,ఆ నిధులతో ముందుగా సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపారు.త్వరలో మిగతా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.ఈ పర్యటనలో డిఇ స్వరూప,కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ సిబ్బంది,రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీను,ఇతర నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.