సాక్షి డిజిటల్ న్యూస్ : 4 నవంబర్ 2025 తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గం, ములకలచెరువు మండలం, కోనేటివారిపల్లి గ్రామంలో ఇటీవల తుఫాన్ కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడి గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. గ్రామ ప్రజలు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పాలగిరి సిద్ధ ని కలిసి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, మట్టి తొలలాలని కోరగానే, ఆయన వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించే ఏర్పాట్లు చేశారు. పాలగిరి సిద్ధ వెంటనే స్పందించినందుకు గ్రామ ప్రజలందరూ ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.