పర్యావరణహిత ఎకో బజారును విద్యార్థుల ద్వారా ఏర్పాటు

* ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు రాహత్ ఖానం

సాక్షి డిజిటల్ న్యూస్,నవంబర్ 04,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణహిత ఎకో బజారును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు రాహత్ ఖానం మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, పర్యావరణ పరిరక్షణ కలిగింపజేయాలన్న సంకల్పాన్ని పొందింప చేయడం ప్రధాన ఉద్దేశ్యాలుగా ఈ ఎకో బజార్ నిర్వహించడం జరిగిందని అన్నారు. విద్యార్థులచే వివిధ వస్తువులు, తినుబండారాలు ప్లాస్టిక్ రహిత పదార్థాలతో కూడిన 16 స్టాళ్ళను ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగిందని,తెలంగాణ పిండివంటలను విద్యార్థులే స్వయంగా తయారుచేసి ఈ స్టాళ్ళలో అమ్మడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక పాఠశాల,జూనియర్ కళాశాల విద్యార్థులు,స్థానిక ప్రజలు సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు సి.జగదీష్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు చదువుతోపాటు మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉపాధిని పొందే అవకాశం ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి వెంకటేశ్వరరావు,ఐక్య ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ,అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె చిన్న బాబు,పాలనాధికారి జి కరుణాకర్,అధ్యాపకులు డాక్టర్ రత్న మంజుల, డాక్టర్ జి సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్ వెంకట్, డాక్టర్ డి కిషన్,డాక్టర్ ఎం బ్రహ్మం, డాక్టర్ ఎం రవీందర్ రావు, డాక్టర్ ఆర్ శ్రీను, టి శ్రీనివాస్, బాలరాజు, రాధిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *