పత్తి కొనుగోలు పై రైతుకు అవగాహన

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద నవంబర్ 4, రైతులకు పత్తి కొనుగోలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రమైన హోళగుంద లోని రైతు సేవ కేంద్రం నందు రైతులకు అవగాహన కల్పించినట్లు వారి పేర్కొన్నారు మండలంలోని పత్తి నింగు చేసిన రైతులు కనీస మద్దతు ధర (అ.8110) కు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సి సి ఐ సెంటర్లలో అమ్ముకోవచ్చని వారు తెలిపారు ఈ -క్రాప్ బుకింగ్ లో నమోదు చేసుకొన్న రైతులు, రైతు సేవా కేంద్రాలను సంప్రదించి సీఎం ఏ ఏ పి మరియు కిసాన్ కపాస్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రైతులకు సూచించారు పత్తిలో తేమశాతం 81.ఉంటే-కనీస మద్దతు ధర ఆ. 8110 గా ప్రభుత్వం వారు సి సి ఐ ద్వారా చెల్లించడం జరుగుతుందన్నారు
తేమ శాతం పెరిగితే – మద్దతు ధర తగ్గుతుందన్నారు మండలంలో ఇప్పటి వరకు క్రాప్ బుకింగ్ ప్రకారం 36,685 ఎకరాల్లో పత్తి సాగు చేయడం జరిగిందని వారు తెలిపారు రైతులు ఎవరైనా క్రాప్ బుకింగ్ నమోదు చేయకుంటే.. సంబంధిత రైతు సేవ కేంద్రంలో లేదా మండల వ్యవసాయ అధికారి వారిని సంప్రదించాలి వారు తెలిపారు అనంతరం రైతులతో కలిసి మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్ అధ్వర్యంలో పాలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు రైతులకు పంటలపై తగు సూచనలు సలహాలు అందించారన్నారు ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ తిరుపాక్షి, వి ఏ ఏ కృష్ణ నాయిక్, విహెచ్ఎ రమేష్, లక్ష్మన్న మరియు కూటమి నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పంపావతి మిక్కిలినేని రమేష్ ఎర్రిస్వామి రైతులు కృష్ణయ్య శంకరప్ప నూరుల్ల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *