నవంబర్ 4, సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ జగన్, మండల కేంద్రమైన వేంసూర్ లో, మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు బాధను అర్ధం చేసుకున్న తెలుగురైతు కార్యదర్శి బొంతు భాస్కర్ రావు మంగళవారం నాడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్సించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం కు వెళ్లి, తాసిల్దార్ మాణిక్ రావు ని కలిసి ధాన్యం కొనుగోలు చేసే వివరాలు తెలిపి, వాతావరణం ప్రభావం వర్షం గా ఉంది రైతులకు న్యాయం చేయాలని వినతి పత్రం అందించారు. దీని విషయంపై తాసిల్దార్ స్పందించి రైతులకు న్యాయం చేస్తామని అన్నారు.
