సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 5 తిరుమలగిరి మండల రిపోర్టర్ భాకి శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా నాలుగు కూడలి లోఉన్న రోడ్లను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ ను నియంత్రించాలని అలాగే ప్రమాద స్థలాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక సిఐతో పాటు ఎస్సైలను ఆదేశించారు, హైవే తో పాటు మున్సిపల్ అధికారులు ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ కు సహకరించాలని కోరారు, అనంతరం తొండ , వెలిశాల గ్రామాల్లో ప్రమాద స్థలాలను గుర్తించారు ఎస్పీ వెంట డిఎస్పి వడ్డే ప్రసన్నకుమార్ నాగారం సిఐ నాగేశ్వరరావు తిరుమలగిరి ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు తో పాటు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు