జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కొత్త హౌసింగ్ బోర్డ్ సమీపంలో కలెక్టరేట్ ఎదురుగా భాగ్యలక్ష్మి భోజన హోటల్లో కలుషిత భోజనం

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 2025 రిపోర్టర్ రాజు గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాలో భాగ్యలక్ష్మి హోటల్లో ఈగ పడిన భోజనంపెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హోటల్ యజమాని, ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా భోజనంలో ఈగ కనిపిస్తే నిర్లక్ష్య ధోరణి తో సమాధానం హోటల్ యజమాని దృష్టికి తీసుకెళ్లగా ఈగని పక్కకు పెట్టు లేదా మళ్లీ కొత్త ప్లేట్లో భోజనం చెయ్యండి తిను అంటు నిర్లక్ష్యమైన సమాధానం చెబుతున్నాడు. ఇదేంటి అని అడుగుతుండగా ఇంతమందికి లేని సమస్య నీ ఒక్కనికి ఎందుకు అంటూ వ్యవహరించడం అక్కడున్న భోజనం ప్రియులను ఆశ్చర్యం గురి చేస్తున్నట్టు ఒక కస్టమర్ మీడియాకు తెలియజేశారు హోటల్ యజమానిపై సంబంధింత అధికారులు తగుచర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు