సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 పెనగలూరు రిపోర్టర్ మధు పెనగలూరు మండలం నడిమి సిద్వారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చేపల వేటకు వెళ్ళగా కిరణం పల్లి సమీపాన గల గుంజినేరులో ఇద్దరు వ్యక్తులు చనిపోగా ఒక వ్యక్తి మృత్యుంజయుడుగా బయటపడ్డాడు. ఈ సంఘటన న రాజంపేట రూరల్ సిఐ బివి రమణ మృతదేహాలను పరిశీలిం చారు. మృ తుల భార్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను సేఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను శేవ పరీక్షల కోసం పరీక్షల కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏ ఎస్ ఐ రాముడుతెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నడిమి సిద్దివరం గ్రామానికి చెందిన సింగనమల శ్రీనివాసులు 45 దుగ్గన బోయిన మల్లికార్జున 35 కోనేటి సుబ్బ నరసయ్య మంగళవారం మధ్యాహ్నం గుంజినేయులు చేపల వేట కోసం మల్లికార్జున వాహనంలో బయలుదేరారు సింగనమల ఈటిమాపురం మధ్యలో ఉన్న వంతెనపై నుంచి చుట్టూ తిరిగి తిరణం పల్లె చేరుకున్నారు. నదిలో సిరివరం కిరణం పల్లి వాసులు ఏర్పాటు చేసుకున్న నీళ్లలోని మట్టి రోడ్డుపై నడుచుకుంటూ నీళ్లలో దిగారు ఈత రా నీశ్రీనివాసులు లోతులో దిగిపోతుండగా కాపాడమని అరవడంతో తక్కువ లోతులో నిలబడి ఉన్న ఈత తెలిసిన మల్లికార్జున ఆయనను కాపాడే ప్రయత్నం చేశారు. నీళ్లలో మునిగిపోతున్న ఈతరాణి శ్రీనివాసులు మల్లికార్జున గట్టిగా పట్టుకోవడంతో అతను కూడా నీళ్లలో మునిగిపోతూ రక్షించమని గట్టిగా అరుస్తుండడంతో వీరి వెంట వెళ్లిన మూడో వ్యక్తి కోనేటి సుబ్బ నరసయ్య భయంతో పారిపోతి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా మల్లికార్జున ఆయన పంచ పట్టుకొని గడ్డకు వచ్చే ప్రయత్నం చేశాడు తక్కువ లోతులో నిలబడి ఉన్న సుబ్బ నరసయ్య తనకేమి జరుగుతుందోనని భయపడి తన పంచెను వదిలేశాడు ఈ క్రమంలో సుబ్బ నరసయ్య మృత్యుంజయుడుగా బయటపడ్డాడు. సుబ్బ నరసయ్య గట్టిగా కేకలు వేయడంతో సమీప పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న కిరణం పల్లివాసులు పరిగెత్తుకుంటూ వచ్చి పది నిమిషాల లోపే చనిపోయిన వారిని ఒడ్డుకు చేర్చారు. ఈ విషయం ఒడ్డు నుండి బయటపడిన మూడో వ్యక్తి సుబ్బ నరసయ్య సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాస్తవాలను రికార్డు చేశారు. మల్లికార్జున భార్య నాగవేణి శ్రీనివాసులు భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ రాముడు తెలిపారు