గైర్హాజర్ పేరుతో యాజమాన్యం చేస్తున్న కుట్రలు

★వ్యతి రేకిస్తున్నాం సి ఐ టి యు

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 4 మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: గైర్హాజర్ పేరుతో యాజమాన్యం కార్మికులను భయభ్రాంతులకు గురిచేయడాన్ని లక్ష్మారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి వల్లూరు వెంకటరత్నం విమర్శించారు. గైరాజర్ చేస్తున్న కార్మికులను యాజమాన్యం కౌన్సిలింగ్ చేసి సరైన పద్ధతిలో విధులకు హాజరయ్యేట్లు చేయడానికి సీఐటీయూ యూనియన్ పూర్తిగా సమర్థిస్తుందని, కానీ ఆ పేరుతో ఎప్పుడో ఒకసారి కొన్ని అనివార్య కారణాల వలన ఒక నెలలో 16/20 మాస్టర్లు తక్కువ చేసిన కార్మికులను కూడా కౌన్సిలింగ్ పేరుతో యాజమాన్యం నోటీసులు ఇచ్చి ఆ కుటుంబాలను వేదించడం సరైన పద్ధతి కాదని, యాజమాన్యం పెట్టిన 150 మస్టర్లు అయిన వారిని కూడా ప్రతి నెల 20 మాస్టారులకు తగ్గితే కౌన్సిలింగ్ రావాలని యాజమాన్యం నోటీసు బోర్డులు వేయడం సమర్ధనీయం కాదని సిఐటియు యూనియన్ గా యాజమాన్యానికి సూచిస్తున్నాం. ఈ విషయంలో గుర్తింపు మరియు ప్రాతినిధ్య సంఘాలు తమ వైఖరిని బట్టబయలు చేయాలని, యాజమాన్యం దగ్గర దోబూసులాడే వైఖరి, సన్నాయి నొక్కుడు విడనాడాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమావేశంలో రామ్మూర్తి ఈశ్వరరావు విల్సన్ రాజు ప్రభాకర్ రావు బుచ్చిరెడ్డి బిక్షపతి సాయి కృష్ణ శ్రీకాంత్ సుమన్ ముజఫర్ రామకృష్ణ విజయ్ కుమార్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు