కోటిలింగాల దేవాలయాన్ని సందర్శించినఎస్ పి,డి.ఎస్.పి

సాక్షి డిజిటల్ న్యూస్ 5నవంబర్ 2025 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి తెలంగాణలోనే కాకతీయ కాలం నుండి ప్రసిద్ధిగాంచిన కోటేశ్వర స్వామి దేవస్థానం ఆలయం.జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం గ్రామపంచాయతీ కోటిలింగాల అనుసంధానంగా ఉన్న కోసన్నపల్లి గ్రామ చివారిలో ఒకవైపు గోదావరి నది మరోవైపు కోటేశ్వర స్వామి దేవస్థాన ఆలయం. చూసేందుకు కన్నుల పండుగ ఉందంటున్న ఎస్ పి,డి ఎస్పీ ఈ సందర్భంగాఎస్ పి, డి ఎస్పీ దంపతులు కాలభైరవుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేష్, శాలువ కప్పి సన్మానం చేశారు. పురాతనమైన కాలభైరవుని విగ్రహం ఈ మధ్య కాలం లో వెలచి రావడంతో తాము కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని మహిమ గల కోటేశ్వర స్వామి దేవుడు అని ఆలయ పూజారి నాగరాజ్ శర్మ, సంజీవ్ శర్మ అన్నారు ఈ కార్యక్రమంలో ధర్మపురి సి ఐ రాం నరసింహ రెడ్డి. వెల్గటూర్ ఎస్ ఐ ఉమాసాగర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు