కిసాన్ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్‌గా మద్దిశెట్టి నియామకం

తల్లాడ/నవంబర్ 05(సాక్షి డిజిటల్ న్యూస్ ) భారతీయ యువసేవ సంఘం నుంచి మద్దిశెట్టి సామేలు గారికి కిసాన్ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్‌గా అరుదైన అవకాశం లభించింది. ఈ నియామకం భారతీయ యువసేవ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ జి. రోషన్ గుప్తా గారి సూచనల మేరకు జరిగింది.తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందిన మద్దిశెట్టి గారికి ఈ గౌరవం దక్కడం రాష్ట్రానికి గర్వకారణం.
మద్దిశెట్టి గారు నేషనల్ ఫౌండర్ శ్రీ భరణి బాలకృష్ణన్, నేషనల్ ప్రెసిడెంట్ రోషన్ గుప్తా నేషనల్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ సౌరవ్ దాస్ నేషనల్ సెక్రటరీ షేక్ షావలి మరియు మిగతా కోర్ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భారతీయ యువసేవ సంఘం (B.Y.S.S) అనేది భారత ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణ శాఖ, యమ్ యస్ యమ్ ఇ మీ వంటి శాఖలతో అనుబంధంగా పనిచేసే జాతీయ స్థాయి సంస్థ.ఇది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సిద్ధాంతాలతో పని చేస్తూ దేశ యువతలో సేవా, జాతీయతా, వ్యవసాయ అభివృద్ధి భావాలను పెంపొందిస్తోంది.