ఐఎఎస్ అధికారుల బృందం జిల్లా పర్యటనకు వస్తున్నందున శాఖల వారిగా సమగ్ర నివేదికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

నవంబర్ 4 సాక్షి డిజిటల్ టీవీ జయశంకర్ భూపాలపల్లి. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, పరిపాలనా విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజా సంక్షేమ పథకాల అమలు పరిశీలనకు ట్రైనీ ట్రైని అధికారుల పర్యటన సందర్భంగా మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య, విద్య, మిషన్ భగీరథ, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ట్రైనీ అధికారులు విద్యా, వైద్య, అంగన్ వాడి కేంద్రాలు, స్వయం సహాయక సంఘాలు నిర్వహణ, నర్సరీలు, డంపింగ్ యార్డులు,మిషన్ భగీరథ వంటి పథకాల అమలుపై వివరాలు అందించాలని ఆదేశించారు. పలిమెల మండలం లెంకల గడ్డ, మహా ముత్తారం మండలం ములుగుపెల్లిలో పంచాయతిలలో పర్యటన ఉంటుందని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రణాళిక లు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే గ్రామాలలో బస చేయాల్సి ఉంటుందని ప్రాథమిక పాఠశాలలో బస, భోజన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులు ముందస్తుగా మండలంలో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అధికారుల పర్యటనకు సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తు చేయాలని తెలిపారు. రవాణా పర్యవేక్షణ కు లైజనింగ్ అధికారులను నియమించాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, కాటారం డిఎస్పి సూర్యనారాయణ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డిఈఓ రాజేందర్, సంక్షేమ అధికారిని మల్లేశ్వరి, మిషన్ భగీరథ ఈఈ శ్వేత, ఆయా మండలాల తహసిల్దారులు, ఎంపీడీవోలు, సీడీపీఓ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *